Telugudesam: టీడీపీని వీడే ప్రసక్తే లేదు: నటి దివ్యవాణి

  • నేను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అబద్ధం
  • నా తుదిశ్వాస వరకూ పార్టీని వీడే ప్రసక్తే లేదు
  • బాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పాటుపడతా 
టీడీపీ అధికార ప్రతినిధి, నటి దివ్యవాణి ఆ పార్టీని వీడుతున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో దివ్యవాణి స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన తుదిశ్వాస వరకూ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే వారే నిజమైన నాయకులని చెప్పిన దివ్యవాణి, చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
Telugudesam
spokes person
Artish
Divya Vani

More Telugu News