‘జేమ్స్ బాండ్’ 25వ సినిమా టైటిల్ ను ప్రకటించిన చిత్రబృందం!
- జేమ్స్ బాండ్ గా నటిస్తున్న డానియెల్ క్రెగ్
- దర్శకత్వం వహిస్తున్న క్యారీ జోజీ
- 2020, ఏప్రిల్ 3న బ్రిటన్ లో విడుదల
తొలుత షట్టర్ హ్యాండ్స్, ఎక్లిప్స్, ఏ రీజన్ టు డై అనే టైటిళ్లను సినిమా బృందం పరిశీలించింది. చివరగా జేమ్స్ బాండ్ 25వ సినిమాకు ‘నో టైమ్ టు డై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ ప్రకటించిన చిత్ర యూనిట్ సినిమాను బ్రిటన్ లో 2020, ఏఫ్రిల్ 3న, అమెరికాలో ఏప్రిల్ 8న విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ సినిమాలో హీరోగా డానియెల్ క్రెగ్ నటిస్తున్నారు. ఆయన జేమ్స్ బాండ్ పాత్రను పోషించడం ఇది ఐదోసారి.