బాలీవుడ్ లో నటించడానికి నాకేం ఇబ్బంది?: రామ్ చరణ్

  • సైరా హిందీ టీజర్ ముంబయిలో విడుదల
  • కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా
  • మంచి కథ లభిస్తే బాలీవుడ్ లో కూడా చేస్తానన్న చెర్రీ
దేశానికి పెద్దగా తెలియని తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో హిందీ వెర్షన్ టీజర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, తమన్నా, బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిచ్చారు.

బాలీవుడ్ లో నటించడానికి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? అని ప్రశ్నించగా, బాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బందిలేదని, అయితే సరైన కథ దొరక్కపోవడం వల్లే తాను బాలీవుడ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని వివరించారు. సరైన ప్రాజక్ట్ అనుకుంటే బాలీవుడ్ లో నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని రామ్ చరణ్ స్పష్టం చేశారు. అయితే, తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించలేకపోతున్నానని తెలిపారు.
Go Back to Shorts
Ramcharan
Chiranjeevi
Sye Raa Narasimha Reddy

More Telugu News