Jayasudha: చిరంజీవిగారి కష్టమే ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టింది: జయసుధ

  • చిరంజీవిగారు గట్టి పోటీని తట్టుకున్నారు 
  • తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు 
  • చిరంజీవి గారి అంకితభావమే ఆయన సక్సెస్ కి కారణం
తాజా ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ, చిరంజీవిని గురించి ప్రస్తావించారు. "చిరంజీవిగారితో నేను చేసిన సినిమాలు చాలా తక్కువ .. ఆయనకి హీరోయిన్ గా చేసింది ఒక సినిమానే. ఆయన ఎంతగా కష్టపడుతూ ఎదుగుతూ వచ్చారో నేను చూశాను. చిరంజీవిగారు వచ్చేటప్పటికే ఒక వైపున ఎన్టీఆర్ - ఏఎన్నార్, మరో వైపున కృష్ణ - శోభన్ బాబు తిరుగులేని కథానాయకులుగా ఏలేస్తున్నారు.

ఇంతమందిని తట్టుకుని నిలబడటమనేది అంత తేలికైన విషయం కాదు. ఎవరిలా తను కనిపించకూడదు .. ఎవరినీ అనుకరించకూడదు అనే ఉద్దేశంతో, చిరంజీవి గారు తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆ స్టైల్ తో జనం దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. సెట్లో ఆయన అంకితభావంతో పనిచేసే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగానే ఆయన మెగాస్టార్ గా నిలబడగలిగారు" అని చెప్పుకొచ్చారు.
Jayasudha
Chiranjeevi

More Telugu News