చంద్రబాబు ఆదేశాలతోనే ఏపీ టీడీపీ నుంచి ఫిరాయింపులు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • తెలంగాణలో చంద్రబాబు ఇదే చేశారు
  • కొందర్ని కాంగ్రెస్, మరికొందర్ని బీజేపీలోకి పంపారు
  • ట్విట్టర్ లో విమర్శించిన వైసీపీ నేత
తెలంగాణ టీడీపీ నేతల్లో కొందరిని చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్ లోకి పంపారనీ, మిగిలినవారిని బీజేపీకిలోకి పంపారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ ఫినిష్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ నుంచి ఫిరాయింపులు జోరందుకున్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు.

అయితే టీడీపీని వీడుతున్న నేతలెవరూ చంద్రబాబుపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. దీన్ని బట్టి ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Telangana
Vijay Sai Reddy
Twitter

More Telugu News