Shiva kandukuri: 'పెళ్లి చూపులు' నిర్మాత తనయుడు హీరోగా 'చూసీ చూడంగానే' .. ఫస్టులుక్ రిలీజ్

  • మరో ప్రేమకథగా 'చూసీ చూడంగానే'
  • నాయకా నాయికల తొలి సినిమా 
  • సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు
తెలుగు చిత్రపరిశ్రమలో కొత్తదనం కలిగిన చిన్న సినిమాలను, విషయం వున్న కొత్త దర్శకులను ప్రోత్సహించే నిర్మాతగా రాజ్ కందుకూరి కనిపిస్తాడు. ఆయన నిర్మించిన 'పెళ్లి చూపులు' ఒక ట్రెండు సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఆయన, తన తనయుడు 'శివ'ను తెలుగు తెరకి హీరోగా పరిచయం చేస్తూ 'చూసీ చూడంగానే' అనే ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు.

శేష సింధూరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, దగ్గుబాటి సురేశ్ బాబు చేతుల మీదుగా ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయించారు. తన కెమెరాలో ఏదో దృశ్యాన్ని బంధిస్తూ ఈ పోస్టర్లో శివ కందుకూరి కనిపిస్తున్నాడు. ఈ సినిమాతోనే 'వర్ష' అనే తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయం కానుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు.
Shiva kandukuri

More Telugu News