Telangana: కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా: ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన గుత్తా

  • కేసీఆర్, కేటీఆర్, మంత్రులు నేతలకు కృతఙ్ఞతలు
  • గతంలో ఎంపీగా ప్రజలకు సేవలందించా
  • ఎమ్మెల్సీగానూ సేవలు అందిస్తా
తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, తాను ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, మంత్రులు, పార్టీ నేతలకు ఆయన తన కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, గతంలో ఎంపీగా ప్రజలకు ఏవిధంగా అయితే సేవలందించానో, ఎమ్మెల్సీగానూ వారికి సేవలందిస్తానని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని గుత్తా స్వీకరించారు.
Telangana
cm
kcr
MLA Quota
Mlc

More Telugu News