శ్రీశైలం ఆలయాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
- శ్రీశైలంలో షాపులను ఓ వర్గం వారికే కేటాయించారు
- ఇది కరెక్టు కాదు
- రేపు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన
ఈ ఆరోపణలపై శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి స్పందిస్తూ, శ్రీశైలంలోని షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటలు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే జరిగాయని, డీడీలు పరిశీలించి అన్యమతస్తుల దరఖాస్తులను అనుమతించలేదని స్పష్టం చేశారు.
శ్రీశైలంలో సెక్షన్ 30 అమలులో ఉందని, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు వీలు లేదని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలిపితే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.