Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలుగా మోపిదేవి, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

  • ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
  • ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటన
  • ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించిన ఇక్బాల్ 
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ ఎమ్మెల్సీలుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రాన్ని ఇక్బాల్ అందుకున్నారు. కాగా, వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో, ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరూ బరిలో నిలవలేదు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి ఎన్నికయ్యారు.
Andhra Pradesh
Mla quota
Mlc

More Telugu News