Sharwanand: ఇకపై కథల విషయంలో రాజీ పడను: శర్వానంద్

షార్ట్స్‌లో చూడండి
శర్వానంద్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రణరంగం' ఆశించినస్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా అడివి శేష్ 'ఎవరు' కంటే వసూళ్ల విషయంలో వెనుకబడింది. 'రణరంగం' ఆశించినస్థాయిలో అంచనాలను అందుకోలేకపోయిందనే విషయాన్ని శర్వానంద్ గ్రహించాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. 'రణరంగం' బాగోలేదని ఎవరూ అనడం లేదు .. కానీ అందులో ఏదో మిస్ అయింది. ఈ కారణంగానే ఈ సినిమా సరిగ్గా ఆడటం లేదు. అయితే కథలో ఏం లోపించిందనే విషయంలో ఇండస్ట్రీ ఫీడ్ బ్యాక్ ఒకలా వుంది .. బయట వేరేలా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఏదీ అర్థం కావడం లేదు. ఇకపై కథలపై మరింత శ్రద్ధ పెడతాను. అవసరమైతే ఎక్కువ సమయం తీసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Sharwanand
kajal

More Telugu News