ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్
- క్రికెట్ నేపథ్యంలో సాగే 'కౌసల్య కృష్ణమూర్తి'
- ప్రధాన పాత్రధారిగా ఐశ్వర్య రాజేశ్
- ఈ నెల 23వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. కౌసల్య అనే అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదిరించి క్రికెటర్ గా ఎదిగిందనేది ఈ ట్రైలర్లో చూపించారు. 'నీ వల్ల కాదూ అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లను కాదు .. నిన్ను' .. 'ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు .. గెలిచిన వాళ్ల మాట వింటుంది .. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు' అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి.