Mamata banerjee: కశ్మీర్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
  • భద్రత పేరుతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు
  • ఆర్టికల్ 370 రద్దు సరైంది కాదు
కశ్మీర్ పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని... కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత... భద్రత పేరుతో పోలీసులు తీవ్ర ఆంక్షలను విధించారని... దీంతో, అక్కడ మానవ హక్కులు మంటకలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరైన చర్య కాదని చెప్పారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మమత వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
Mamata banerjee
Kashmir
TMC
Article 370

More Telugu News