Narendra Modi: మోదీకి స్వాగతాన్ని మించిపోయేలా వీడ్కోలు పలికిన భూటాన్ ప్రజలు

  • నిన్న భూటాన్ లో అడుగుపెట్టిన మోదీ
  • భూటాన్ లో ముగిసిన రెండ్రోజుల పర్యటన
  • భారత్ పయనమైన ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ లో రెండ్రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వమైన రీతిలో వీడ్కోలు లభించింది. నిన్న భూటాన్ లో అడుగుపెట్టిన మోదీకి విద్యార్థులు రోడ్డు పక్కనే నిలుచుని మానవ హారం తరహాలో స్వాగతం పలికారు. ఇప్పుడు దాన్ని మించిపోయేలా విద్యార్థులకు తోడు భూటాన్ ప్రజలు కూడా విమానాశ్రయం వరకు రహదారి పక్కనే నిలుచుని మోదీకి విషెస్ తెలిపారు. వేల సంఖ్యలో మహిళలు సంప్రదాయ భూటానీ దుస్తుల్లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో ఏ భారత ప్రధానికి ఇంతటి ఘనమైన వీడ్కోలు లభించలేదంటే అతిశయోక్తి కాదు!

Narendra Modi
Bhutan

More Telugu News