Karnataka: కర్ణాటక హాస్టల్ లో విద్యుత్ షాక్.. ఐదుగురు పిల్లల దుర్మరణం!

  • కొప్పల్ జిల్లాలో ఘటన
  • హాస్టల్ లో విద్యుత్ ప్రసారం
  • రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం యడియూరప్ప
కర్ణాటకలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొప్పల్ జిల్లాలోని ఓ హాస్టల్ లో కరెంట్ షాక్ కొట్టడంతో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులకు షాక్ కొట్టడంతో తోటి విద్యార్థులు విద్యుత్ సరఫరాను ఆపి యజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో హాస్టల్ అధికారులు వీరిని ఆసుపత్రికి తరలించగా, ఐదుగురు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Karnataka
HOSTEL
ELECTRICITY SHOCK
FIVE STUDENTS
DEAD
KOPPAL

More Telugu News