అనంతపురంలో దారుణం.. టీడీపీ నేత కారును తగులబెట్టిన దుండగులు!
- ఏపీలోని చిలమత్తూరులో ఘటన
- అర్ధరాత్రి దాటాక పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన అగంతకులు
- రూ.3 లక్షల నష్టం వచ్చిందని టీడీపీ నేత ఆవేదన
ఈ ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయింది. కాగా, ఈ ఘటనపై టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన వాహనాన్ని తగులబెట్టారని లక్ష్మీనారాయణప్ప తెలిపారు. ఈ ప్రమాదంతో రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన చిలమత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.