Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేహితుడి భార్యతో సన్నిహిత వీడియోలు అప్ లోడ్... కంప్లయింట్ లేక హెచ్చరించి పంపేసిన పోలీసులు!

  • తమిళనాడులోని మార్తాండం సమీపంలో ఘటన
  • జవాన్ గా పనిచేస్తున్న స్నేహితుడి భార్యతో వివాహేతర బంధం
  • వీడియోలు బయటకు వచ్చినా ఏమీ చేయలేకపోయిన పోలీసులు
తన స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, ఆ దృశ్యాలను స్మార్ట్ ఫోన్ లో తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేసు పెట్టేందుకు సదరు యువతి నిరాకరించడంతో, నిందితుడిని హెచ్చరించి వదిలేశారు. ఈ ఘటన తమిళనాడులోని మార్తాండం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, సెకండ్‌ హ్యాండ్‌ బైకులను విక్రయించే రమేశ్ వద్ద జవాన్ గా పనిచేస్తున్న యువకుడు బైక్ కొన్నాడు.

ఆ పరిచయంతో అతని ఇంటికి వెళ్లడం ప్రారంభించిన రమేశ్, అతను డ్యూటీ నిమిత్తం దీర్ఘకాలం పాటు వెళ్లిన వేళ, భార్యకు దగ్గరయ్యాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో వీడియోలు తీసుకున్నాడు. ఇక ఆ వీడియోలను రమేశ్ సోషల్ మీడియాలో పెట్టడంతో సదరు సైనికుడి కంటపడ్డాయి. దీంతో అతను పోలీసులకు విషయం చెప్పినప్పటికీ, కేసు పెట్టేందుకు మాత్రం అతని కుటుంబం నిరాకరించింది. దీంతో రమేశ్ ను పిలిపించిన పోలీసు అధికారులు, అతన్ని హెచ్చరించి పంపేశారు.
Friend
Wife
Social Media
Videos

More Telugu News