Chandrababu: నా ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని మన మంత్రులు చూస్తున్నారు!: చంద్రబాబునాయుడు

  • వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
  • వాళ్ళను పట్టించుకోవట్లేదు
  • నా ఇంటిపై కాదు వరదల మీద శ్రద్ధ పెట్టండి  
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఒకవైపు వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పట్టించుకోవాల్సింది పోయి, తన ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని ఏపీ మంత్రులు చూస్తున్నారని విమర్శించారు. ‘నా ఇంటి మీద పెట్టే శ్రద్ధ కాస్తయినా వరదల మీద పెట్టి ఉంటే ప్రజలకి ఇబ్బందులు తప్పేవి’ అని సూచించారు. ఈ సందర్భంగా వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు పోస్ట్ చేశారు.  నాలుగు రోజుల నుంచి తమను ఎవరూ పట్టించుకున్నవారే లేరని విజయవాడలోని కృష్ణలంకకు చెందిన ఓ మహిళ ఇందులో వాపోయింది.  
Chandrababu
Telugudesam
YSRCP
botsa
Vellampalli

More Telugu News