Chandrababu: ఆ డ్రోన్ ను చూస్తే భయమెందుకు? బాబు ఇంట్లో అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయా?: మంత్రి కొడాలి నాని

  • వరదల పరిస్థితి తెలుసుకోవడానికే డ్రోన్ వాడారు 
  • చంద్రబాబు, దేవినేని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
  • బాబు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వరదొచ్చిందా?  
కృష్ణా నదికి వరదొచ్చి ప్రాజెక్టులన్నీ నిండుతుంటే, టీడీపీ నేతలు మాత్రం ఏడుస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. 'వరదల పరిస్థితిని తెలుసుకోవడం కోసం డ్రోన్ వినియోగించారు. అసలు ఆ డ్రోన్ ను చూస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? బాబు ఇంట్లో ఏమైనా అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయా?' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమ తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వరద వచ్చిందా? పద్నాలుగేళ్లలో ఏనాడైనా ప్రాజెక్టుల గేట్లు ఎత్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పనికిమాలిన ఆరోపణలు మానుకోవాలని నాని హితవు పలికారు.
Chandrababu
Telugudesam
YSRCP
minister
kodali

More Telugu News