Pawan Kalyan: 'అన్నయ్య'కు 'తమ్ముడు' సాయం... 'సైరా'లో భాగమైన పవన్ కల్యాణ్!

  • సైరాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన పవన్
  • ఫోటోలు పంచుకున్న శ్రేయాస్ మీడియా
  • వైరల్ అవుతున్న చిత్రాలు
చిరంజీవి 151వ చిత్రమైన 'సైరా'లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాగమయ్యారు. చిరంజీవి పక్కన నిలబడి, ఆవేశంతో పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలను సినిమా ప్రమోషన్ సంస్థ శ్రేయాస్ మీడియా విడుదల చేసింది. ట్విట్టర్ లో విడుదలైన ఈ చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమాలో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. "సైరా... నరసింహారెడ్డికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది మెగా ఫ్యాన్స్ కు విందే. ఆయన మాటలు వినడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారు?" అని శ్రేయాస్ మీడియా క్యాప్షన్ పెట్టింది.
Pawan Kalyan
Chiranjeevi
Sairaa
Voice Over

More Telugu News