John Williams: క్రికెట్లో విషాదం... బంతి తగిలి అంపైర్ జాన్ విలియమ్స్ కన్నుమూత!

  • గత నెల 13న మ్యాచ్ లో ప్రమాదం
  • అప్పటి నుంచి కోమాలో ఉన్న విలియమ్స్
  • నిన్న కన్నుమూత
క్రికెట్ మ్యాచ్ లో బాల్ తగిలి కోమాలోకి వెళ్లిపోయిన ప్రముఖ అంపైర్ జాన్ విలియమ్స్ కన్నుమూశారు. గత నెల 13వ తేదీన ట్రిలీట్ లో పెంబ్రోక్, నార్బెర్త్ జట్ల మధ్య డివిజన్ 2 మ్యాచ్ జరుగగా, ఓ ఆటగాడు కొట్టిన బంతి బలంగా విలియమ్స్ ను తాకింది. దీంతో మ్యాచ్ నిలిపివేసిన మేనేజ్ మెంట్, ఆయన్ను కార్డిఫ్ లోని యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయిన ఆయన, నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడించిన పెంబ్రోక్ క్రికెట్, ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపింది. బంతి బలంగా తగలడంతో విలియమ్స్ మెదడులోని నరాలు దెబ్బతిన్నాయని, 80 సంవత్సరాల వయసులో విలియమ్స్ ఉన్న కారణంగా, చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.
John Williams
Died
Cricket
Ball

More Telugu News