రాజోలు పీఎస్ లో లొంగిపోయిన ‘జనసేన’ ఎమ్మెల్యే రాపాక
- మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసు
- ఈ కేసులో ‘ఏ1’గా ఉన్న రాపాక
- రాజోలుకు చేరుకుంటున్న ‘జనసేన’ కార్యకర్తలు
కాగా, మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని విడిచి పెట్టాలని రాపాక, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో రాపాక, ఆయన అనుచరులపై పోలీస్ కేసు నమోదైంది.