బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ పై నిప్పులు చెరిగిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
- ఆరెస్సెస్ నాజీ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందింది
- కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది
- రేపు పాకిస్థాన్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది
‘నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్ హిందూ జాతీయవాదం కేవలం కశ్మీర్ వరకే ఆగిపోదు. భారత్ లోని ముస్లింలందరినీ వీళ్లు అణచివేస్తారు. చివరికి పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుంటారు. వీళ్లంతా హిట్లర్ జాతీయవాదానికి హిందూ వెర్షన్ లాంటివాళ్లు. గతంలో తమ జాతే గొప్పదన్న హిట్లర్ ను సహించినట్లు ప్రపంచదేశాలు దీన్నీ చూసిచూడనట్టు ఊరుకుంటాయా?’ అని ఇమ్రాన్ ప్రశ్నించారు.