రామ్ చరణ్ కు కూడా జాతీయ అవార్డు రావాల్సింది: మంచు విష్ణు
- జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు
- రంగస్థలంలో అద్భుతంగా నటించాడంటూ రామ్ చరణ్ కు కితాబిచ్చిన మంచు విష్ణు
- ఇటీవల కాలంలో చరణ్ దే అత్యుత్తమ నటనా ప్రదర్శన అంటూ ప్రశంస
ఈ మధ్య కాలంలో ఇంతకుమించిన నటనా ప్రదర్శన మరొకటి లేదని, అయినా అభిమానుల ప్రేమ అవార్డుల కంటే గొప్పదని పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో చెర్రీ నటన విమర్శకులను సైతం మెప్పించింది. సమంతతో జంటగా ఓ చెవిటివాడి పాత్రలో జీవించేశాడంటూ మెగా హీరోపై ప్రశంసల వర్షం కురిసింది.