ఏపీ గోశాలలో 100 ఆవుల మృతి.. కచ్చితంగా కుట్ర ఉందన్న ఎమ్మెల్యే రాజా సింగ్!
- స్థలం గొడవ, గోశాలలో గ్రూపులు ఉన్నాయని వ్యాఖ్య
- కొన్ని దుష్టశక్తులు గోశాలపై కన్నేశాయని వెల్లడి
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే
‘ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు ఒకేసారి చనిపోయాయంటే అక్కడ కుట్ర కోణం ఉంది. మాకున్న సమాచారం ప్రకారం స్థానికంగా గోశాల స్థలంపై గొడవ ఉంది. ఇక్కడి భూమి ఖరీదుగా మారిపోవడంతో కొన్ని దుష్టశక్తుల కన్ను ఆ గోశాలపై పడింది. ఆ గోశాలలో కూడా రెండు గ్రూపులు ఉన్నాయని తెలిసింది. ఈరోజు లేదా రేపు మేం గోశాలను సందర్శిస్తాం’ అని రాజాసింగ్ తెలిపారు.