సాంకేతికతతో నేరాల నియంత్రణకు కృషి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- సైబర్ సెక్యూరిటీ అంశంపై జాతీయ సదస్సు
- హాజరైన కిషన్ రెడ్డి, సైబర్ నిపుణులు
- సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం అవసరమన్న కేంద్ర మంత్రి
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ టెక్నాలజీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం అవసరమన్నారు. సైబర్ నేరగాళ్ల అప్పగింతకు ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాలతోనూ ఈ విషయంలో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలో నేరాలను అరికట్టేందుకు స్మార్ట్‌కార్డులు తెచ్చే యోచనలో ఉన్నట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.