Srisailam: జలకళతో పరవళ్లు తొక్కుతున్న శ్రీశైలం ప్రాజక్టు... సందర్శకుల తాకిడితో పోలీసులకు తిప్పలు!

  • కృష్ణా నదికి వరద
  • ప్రాజక్టుకు భారీగా చేరుకుంటున్న సందర్శకులు
  • సందర్శనకు వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్
కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద నిర్మించిన భారీ ప్రాజక్టు చాన్నాళ్ల తర్వాత జలకళతో కనువిందు చేస్తోంది. శ్రీశైలం ప్రాజక్టుకు ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో 10 గేట్లను ఎత్తి నీటిని పంపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రాజక్టు వద్ద కోలాహలం నెలకొంది. సుదీర్ఘ కాలం తర్వాత ప్రాజక్టు నిండుకుండలా కనిపిస్తుండడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రాజక్టు ఏరియా నుంచి దోమలపెంట వరకు 6 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓవైపు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు భారీగా వాహనాలు వస్తుండడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
Srisailam
Krishna River
Traffic

More Telugu News