వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన జగన్
- తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ప్రారంభం
- నందిగం సురేశ్, ఆమంచి చేత రిబ్బన్ కట్ చేయించిన జగన్
- భారీ సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు
అంతకు ముందు కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్ పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.