టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయంలో లంచావతారాలు.. ప్రొటోకాల్ దర్శనం పేరిట భక్తులకు టోకరా!
- బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని మోసం
- భక్తుల నుంచి రూ.24 వేలు వసూలు
- చర్యలు తీసుకోవాలని చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశం
కార్యాలయ సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయడం నిజమేనని విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారు ఆ విషయాన్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది అవినీతి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుబ్బారెడ్డి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. వారిని బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.