KTR: ప్రజలకు మనమేమీ బాకీ లేం: నేతలతో కేటీఆర్

  • ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్నవి ప్రోత్సాహకాలే
  • అవగాహన లేమితో అధికారులను నిలదీయొద్దు
  • వారికీ భార్య, పిల్లలు ఉంటారు
ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నవి ప్రోత్సాహకాలేనని, వారికేమీ మనం బాకీ లేమని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేల్చి చెప్పారు. బుధవారం సిరిసిల్ల జెడ్పీటీసీ సభ్యులతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలానా పథకం తమకు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారితో గొడవకు దిగొద్దని, నచ్చజెప్పాలని సూచించారు. ఈ విషయంలో అధికారులను నిలదీయవద్దని వారికీ భార్య, పిల్లలు ఉంటారని పేర్కొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రమేనని, అవి ఇస్తున్నంత మాత్రాన ప్రజలకు బాకీ ఉన్నట్టు కాదని పేర్కొన్నారు. అవగాహనతో అధికారులను ప్రశ్నిస్తే గౌరవం పెరుగుతుందని, లొల్లి చేస్తే పేపర్లో ఫొటోలు మాత్రమే వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. అతి విశ్వాసం వల్ల కరీంనగర్ ఎంపీ సీటును కోల్పోయామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.
KTR
Telangana
TRS
Karimnagar District

More Telugu News