కశ్మీర్ వీధుల్లో తిరిగిన అజిత్ దోవల్..స్థానికులతో మాటామంతీ!
- ‘ఇప్పుడెలా ఉంది పరిస్థితి?
- ‘పునర్విభజన గురించి ఏనుకుంటున్నారు?
- స్థానికులతో కలిసి భోజనం చేసిన దోవల్
‘ఇప్పుడెలా ఉంది పరిస్థితి?’ ‘పునర్విభజన గురించి ఏనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించిన ధోవల్, స్థానికుల సమాధానాలను ఆసక్తిగా వినడం గమనార్హం. అందరూ బాగుండాలని, ప్రశాంత జీవనం సాగించాలని,ప్రజల భద్రతే తమకు ప్రధానమని, భవిష్యత్ తరాలు బాగుపడేలా పరిస్థితులు మార్చాలని తాము ఎప్పుడూ ఆలోచిస్తుంటామని స్థానికులతో దోవల్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. షోపియాన్ లో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందితో, స్థానిక పోలీసులతో కూడా ఆయన ముచ్చటించారు. సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారిలో స్ఫూర్తిని నింపేలా ఆయన మాట్లాడారు. అజిత్ దోవల్ వెంబడి కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ కూడా ఉన్నారు.