సుష్మా స్వరాజ్ ఆఖరి ఫోన్... రూపాయి బాకీ చెల్లించేందుకు హరీశ్ సాల్వేకు ఆహ్వానం!
- కులభూషణ్ జాదవ్ తరఫున వాదించిన సాల్వే
- కేవలం రూపాయి ఫీజుకే వాదన
- రూపాయి తీసుకెళ్లాలని నిన్న రాత్రి కోరిన సుష్మ
కాగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ తరఫున హరీశ్ సాల్వే వాదించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన కేవలం ఒక్క రూపాయి ఫీజును మాత్రమే తీసుకునేందుకు అంగీకరించారు. ఇంకా ఆయనకు రూపాయి అందలేదు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో సుష్మా స్వరాజ్ స్వయంగా సాల్వేకు ఫోన్ చేశారు. మీరు కేసు గెలిచారని గుర్తు చేస్తూ, ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి, వచ్చి తీసుకెళ్లండన్నారు. ఇదే సంభాషణను గుర్తు చేసుకున్న సాల్వే కన్నీరు పెట్టుకున్నారు.