పాకిస్థాన్ నెటిజెన్ ట్వీట్ పై ఘాటుగా స్పందించిన కేటీఆర్
- కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యల ఫలితంగానే సుష్మ చనిపోయారంటూ పాక్ నెటిజెన్ ట్వీట్
- ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందంటూ వ్యాఖ్య
- ఈ కామెంట్ మీ వక్ర బుద్దిని చూపిస్తోందన్న కేటీఆర్
సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే... మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని అన్నారు. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలరని ట్వీట్ చేశారు.