తెలుగు టీవీ నటుడు మధుప్రకాశ్ భార్య ఆత్మహత్య

  • షూటింగ్ నుంచి  ఆలస్యంగా వస్తుండడంతో ఇద్దరి మధ్య ఘర్షణ
  • వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బెదిరింపు
  • అన్నంత పనీ చేసిన భారతి
తెలుగు టీవీ నటుడు మధుప్రకాశ్ భార్య భారతి (34) ఆత్మహత్య చేసుకున్నారు. 2015లో వీరికి వివాహమైంది. హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలో నివసిస్తున్నారు. మధుప్రకాశ్ టీవీ నటుడు కాగా, భారతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. షూటింగులలో బిజీగా ఉంటున్న మధుప్రకాశ్ ఇటీవల తరచూ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం కూడా ఇదే విషయమై గొడవ జరిగింది.

మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్తున్నట్టు చెప్పిన మధుప్రకాశ్ అటునుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను ఉరివేసుకుంటున్నట్టు చెప్పి బెదిరించింది. మధుప్రకాశ్ దీనిని తేలిగ్గా తీసుకున్నాడు. షూటింగ్ ముగిశాక సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్లాడు. బెడ్‌రూముకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో భార్యను పిలిచాడు. అయినప్పటికీ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూసి నిర్ఘాంతపోయాడు. లోపల భార్య చీరతో సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
TV actor
Madhuprakash
bharathi
suicide
Hyderabad

More Telugu News