మరణానికి కొన్ని గంటల ముందు.. మోదీకి ధన్యవాదాలు చెబుతూ సుష్మ ట్వీట్
- ఈ రోజు కోసమే జీవితకాలం ఎదురుచూశా
- రాత్రి ఏడున్నర ప్రాంతంలో ట్వీట్
- అదే ఆమె చివరి ట్వీట్
ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు లోక్సభలో ఆమోద ముద్ర పడిన వెంటనే సుష్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాత్రి ఏడున్నర సమయంలో ఆమె ట్వీట్ చేశారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు.