Narendra Modi: లోక్ సభలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం... వందేమాతరం ఆలపించిన బీజేపీ ఎంపీలు

  • ఆర్టికల్ 370 రద్దుతో హీరోగా మారిపోయిన మోదీ
  • సంఘ్ పరివార్ నుంచి ప్రశంసల వర్షం
  • లోక్ సభలో మోదీపై పొగడ్తల జల్లు కురిపించిన అమిత్ షా
ఎంతో సాహసోపేతం అనదగ్గ రీతిలో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ చరిత్రను మలుపుతిప్పిన ప్రధాని నరేంద్ర మోదీకి లోక్ సభలో అపూర్వ స్వాగతం లభించింది. కశ్మీర్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని లోక్ సభకు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు వందేమాతరం ఆలపిస్తూ మోదీకి స్వాగతం పలికారు.

ప్రధాన ద్వారం వద్ద మోదీ కనిపించగానే అందరూ మర్యాదపూర్వకంగా లేచి నిలుచున్నారు. ఆపై వందేమాతరం గీతాలాపన, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. మోదీ వినమ్రంగా అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరించి తన సీట్లో కూర్చున్నారు. లోక్ సభలో ఈ సన్నివేశం బీజేపీ సభ్యులను భావోద్వేగాల్లో ముంచెత్తింది. కాగా, బిల్లు సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ప్రధాని మోదీ చాలా సాహసంతో వ్యవహరించి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు.
Narendra Modi
BJP
Lok Sabha

More Telugu News