Dharmapuri Arvind: టీఆర్ఎస్, ఎంఐఎంలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తగిలింది: బీజేపీ ఎంపీ అరవింద్

  • ఆర్టికల్ 370ని రద్దు చేయాలనుకోవడం చారిత్రాత్మక నిర్ణయం
  • కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం నెలకొంది
  • యువత సంబరాలు జరుపుకోవాలి
ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా యువత సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు నేడు శాంతి చేకూరిందని చెప్పారు. భారత్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగం కాదని చెప్పిన టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తగిలిందని, చెంప చెళ్లుమందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చేతకాని ప్రధాని వల్ల 70 ఏళ్లుగా దేశ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
Dharmapuri Arvind
BJP
Articlr 370
MIM
TRS

More Telugu News