ఎంపీ అయినా తెలివిలేదు.. గంభీర్‌పై బిషన్ సింగ్ బేడీ మండిపాటు
- బేడీ, చౌహాన్‌లపై తీవ్ర విమర్శలు చేసిన గంభీర్
- ఖండించిన బిషన్ సింగ్ బేడీ
- డీడీసీఏలో తనకు ఎటువంటి పదవీ లేదని వివరణ
విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన యువ పేసర్ నవ్‌దీప్ సైనీ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించాడు. సైనీ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించిన గంభీర్.. చేతన్ చౌహాన్, బిషన్ సింగ్ బేడీపై తీవ్ర విమర్శలు చేశాడు. అప్పట్లో ఢిల్లీ రంజీ జట్టులోకి ఇతనిని తీసుకోవడానికి వీరిద్దరూ అభ్యంతరం చెప్పారని, ఇప్పుడు సైనీ దెబ్బకు వీరి మిడ్ వికెట్లు ఎగిరిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.