రెండు రాష్ట్రాలుగా జమ్ముకశ్మీర్.. కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్?
- ఆర్టికల్ 370, 35-Aలకు చరమగీతం
- నేడు పార్లమెంటుకు రాష్ట్రాన్ని విడగొట్టే బిల్లు
- ఘంటాపథంగా చెబుతున్న విశ్లేషకులు
నిజానికి గత నెల 26తోనే పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉండగా వాటిని ఈ నెల ఏడో తరగతి వరకు పొడిగించడం, చరిత్రలో తొలిసారిగా అమర్‌నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయడం, జమ్ముకశ్మీర్‌లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం, ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం వంటి పరిణామాలన్నీ ఇందులో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్‌ను మూడు ముక్కలు చేసే బిల్లుకు నేడే ఆమోద ముద్ర కూడా పడుతుందని అంటున్నారు.