యడియూరప్ప ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదు.. 224 చోట్లా ఎన్నికలు జరుగుతాయి!: జేడీఎస్ నేత కుమారస్వామి
- త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయి
- జేడీఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి
- మాండ్యలో జేడీఎస్ కార్యకర్తలతో భేటీ
కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగవచ్చని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఇటీవల కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో 99-105 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, యడియూరప్ప కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూలిపోయేందుకు కారణమైన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ 2023 వరకూ ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు విధించారు.