ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులను కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- రాజ్ నంద్ గావ్ జిల్లాలోని సీతాగోటాలో ఘటన
- నిఘావర్గాల సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్
- మావోల కోసం ఇంకా కొనసాగుతున్న వేట
దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. బలగాలు వెంటనే ప్రతిస్పందించడంతో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. మిగతావారు కాల్పులు జరుపుతూ ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ జరిగిన చోటు నుంచి భారీ సంఖ్యలో తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.