Mahesh Babu: ఓ ఐఏఎస్ అధికారి రాసిన పుస్తకంపై మహేశ్ బాబు అభిప్రాయాలు

  • విశేష ఆదరణ పొందుతున్న సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం
  • తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రచయిత బుర్రా వెంకటేశం
  • అద్భుతమైన పుస్తకం అని పేర్కొన్న మహేశ్ బాబు
దేశవిదేశాల్లోని పుస్తక ప్రియులను విశేషంగా అలరిస్తున్న పుస్తకం 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్'. ఈ పుస్తకం రాసింది ఓ ఐఏఎస్ అధికారి. ఆయన పేరు బుర్రా వెంకటేశం. తెలంగాణ ప్రభుత్వ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన రచయితగా మారి సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనే పుస్తకాన్ని రచించగా, అమెజాన్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకంగా నిలిచింది. తాజాగా, ఈ పుస్తకం చదివిన టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఇదొక అద్భుతమైన పుస్తకం అని, ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం అని సూచించారు. మీరు చదవడమే కాకుండా, మీక్కావాల్సిన వాళ్లకు కూడా దీన్ని కానుకగా ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు. విజయానికి సిసలైన అర్థాన్ని చెప్పిన రచయిత బుర్రా వెంకటేశం నిజంగా అభినందనీయుడు అని మహేశ్ బాబు ప్రశంసించారు. మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక రూపంలో విజయాన్ని కోరుకుంటామని, ఈ పుస్తకంలో విజయానికి అనేక ఉదాహరణలు చూపిన వైనం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
Mahesh Babu
Selfie Of Success
Burra Venkatesam

More Telugu News