Chiranjeevi: చిరంజీవి నివాసంలో కొత్త వెండి పూజా మంటపం

  • ఆదోని వారికి వెండి మంటపం ఆర్డర్ ఇచ్చిన చిరు
  • తయారు చేసిన రంగన్నచారి అండ్ సన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరు వెండి మంటపం ఫొటోలు  
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి సైరా షూటింగ్ లో తలమునకలుగా ఉన్నారు. అయితే, దైవభక్తి మెండుగా ఉన్న ఆయన పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఓ వెండి మంటపం తయారు చేయించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రంగన్నచారి సన్స్ అండ్ మెటల్ వర్క్స్ నిపుణులు ఈ వెండి మంటపాన్ని తయారు చేశారు. ఇటీవలే దేవుడి వెండి మంటపం కోసం చిరంజీవి ఆర్డర్ ఇవ్వగా, రంగన్నచారి మెటల్ వర్క్స్ నిపుణులు వెండి మంటపాన్ని తయారు చేసి చిరంజీవి నివాసానికి తీసుకువచ్చారు. వారితో కలిసి చిరంజీవి ఫొటోలు దిగారు.
Chiranjeevi
Vendi Mantapam
Tollywood
Syraa

More Telugu News