Vijay Sai Reddy: రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో... ములాఖాత్ కు సిద్ధంగా ఉండండి: యనమలపై విజయసాయి వ్యాఖ్యలు

  • ఎన్టీఆర్ పై బాబు వెన్నుపోటు కుట్రలో యనమల పార్ట్ నర్  
  • విలువల గురించి గురివిందలా మాట్లాడుతున్నారంటూ విమర్శ
  • అర్ధరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్ పై కేసులు పెట్టించారంటూ వ్యాఖ్యలు
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచిన కుట్రలో యనమల కూడా భాగస్వామి అని ఆరోపించారు. ఇప్పుడా యనమల విలువల గురించి గురివింద గింజలా మాట్లాడుతున్నారంటూ ట్విట్టర్ లో విమర్శించారు. అర్ధరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్ గారిపై కేసులు పెట్టించింది నీ బాసే కదా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు జైలుకు వెళ్లక తప్పదు, అప్పుడు మీరు వారిని ములాఖాత్ లో కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Yanamala
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News