Virat Kohli: కోహ్లీ ఏంచేసినా రోహిత్ తో ముడిపెడుతున్న నెటిజన్లు!

  • వరల్డ్ కప్ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ కథనాలు
  • కోహ్లీ, అనుష్కలను అన్ ఫాలో చేసిన రోహిత్
  • తాజాగా కోహ్లీ పెట్టిన ఫొటోలో రోహిత్ మిస్
వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో రెండు గ్రూపులు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు నెలకొన్నాయని కథనాలు వచ్చాయి. వీరిద్దరూ ప్రవర్తిస్తున్న తీరు కూడా పలు సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఇటీవలే రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టి జట్టు కోసం కాదు, ప్రతిసారి దేశం కోసమే బరిలో దిగుతాను అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు కోహ్లీ ఇతర టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్టు చేయగా, దానిపై నెటిజన్లు స్పందించారు.

కోహ్లీ పెట్టిన ఆ ఫొటోలో రోహిత్ శర్మ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ... రోహిత్ ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. వరల్డ్ కప్ ముగసిన తర్వాత కోహ్లీని రోహిత్ శర్మ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు అనుమానాలు బయల్దేరాయి. ఆ తర్వాత అనుష్క శర్మను కూడా రోహిత్ అన్ ఫాలో చేయడంతో మొత్తానికి ఏదో జరిగిందన్న సంకేతాలు వెలువడ్డాయి. మరి, ఇది ఎంతవరకు వెళుతుందన్నది కాలమే చెప్పాలి!
Virat Kohli
Rohit Sharma
India
Cricket

More Telugu News