Kesineni Nani: మరో ట్వీటేసిన కేశినేని నాని!

  • బ్యాంకుల పరిస్థితి బాగాలేదు
  • దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే
  • నిమ్మగడ్డకు పట్టిన గతే మీ సహచరుడికి కూడా పడుతుంది 
  • ట్విట్టర్ లో కేశినేని నాని
గత కొంతకాలంగా తన సంచలన ట్వీట్లతో కలకలం రేపుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత కేశినేని నాని, ఈ ఉదయం మరో ట్వీట్ పెట్టారు. నిమ్మగడ్డ ప్రసాద్ కు పట్టిన గతే మీ సహచరుడికి కూడా పడుతుందని జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "అయ్యా జగన్ రెడ్డి గారు, అసలే బ్యాంకుల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగ నీతులు చెప్పమనండి. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుంది" అంటూ పేర్కొంటూ, వైసీపీ నేత పీవీపీ కంపెనీలకు సంబంధించి కెనరా బ్యాంక్ ఇచ్చిన వేలం నోటీసును జత చేశారు. 
Kesineni Nani
Twitter
Jagan
Nimmagadda

More Telugu News