Bonda Uma: న్యూజిలాండ్ లో బొండా ఉమ బంగీ జంప్.. వీడియో

  • న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేసిన బొండా ఉమ
  • తన కోరిక ఇన్నాళ్లకు తీరిందంటూ ఆనందం
  • ఫొటోలు, వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న టీడీపీ నేత
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. బంగీ జంప్ చేయాలనే తన ఆకాంక్షను తీర్చుకున్నారు. న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక కవారౌ బ్రిడ్జ్ మీద నుంచి బంగీ జంప్ చేశారు. 134 మీటర్ల ఎత్తు నుంచి నదిలోకి జంప్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బంగీ జంప్ చేయాలనే తన కోరిక ఇన్నాళ్లకు తీరిందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Bonda Uma
Telugudesam
Bungee Jump
New Zealand

More Telugu News