Jagan: ఏపీకి రావాలన్న జగన్... వెంటనే ఓకే చెప్పిన కేసీఆర్!

  • నిన్న సమావేశమైన కేసీఆర్, జగన్
  • ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు
  • నేడు జరూసలేంకు జగన్
విభజన సమస్యలపై తదుపరి చర్చలను అమరావతిలో కొనసాగిద్దామని ఏపీ సీఎం జగన్ చెప్పగానే, తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించారు. నిన్న ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, గోదావరి నీటి తరలింపు, ఉద్యోగుల బదిలీ సమస్యలపై చర్చించారు. ఇక జగన్ నేడు జరూసలేం వెళ్లనుండగా, తిరిగి వచ్చిన తరువాత సమస్యలపై మరోసారి జరిగే సమావేశం అమరావతిలో ఉండాలని అభిలషించారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కు చెప్పి, ఏపీకి రావాలని ఆహ్వానించగా, మరో ఆలోచన లేకుండా కేసీఆర్ అందుకు సమ్మతించారని తెలుస్తోంది.
Jagan
KCR
Hyderabad
Meeting

More Telugu News