Nara Lokesh: అన్న క్యాంటీన్లు మూతపడడంపై నారా లోకేశ్ ఆవేదన

  • ట్వీట్ చేసిన లోకేశ్
  • ఆకలికి రాజకీయం తెలియదంటూ వ్యాఖ్యలు
  • తమపై కక్షతో పేదవారి కడుపుకొట్టడం సరికాదంటూ హితవు
రాష్ట్రంలో పలుచోట్ల అన్న క్యాంటీన్లు మూతపడడంపై టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆకలికి రాజకీయం తెలియదు ముఖ్యమంత్రి గారూ, అయినా మా మీద కోపంతో పేదవాళ్ల కడుపుమీద కొట్టడం భావ్యం కాదు" అంటూ హితవు పలికారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాదు, మూతపడిన ఓ అన్న క్యాంటీన్ ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లకు తెలుపు రంగు వేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లకు బడుగు, బలహీన వర్గాల నుంచి విశేష ఆదరణ లభించింది. అత్యంత చవకగా భోజనం లభిస్తుండడంతో వీటిలో ఎప్పుడూ విపరీతమైన రద్దీ కనిపించేది.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News