Rakul Preet Singh: బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టనున్న రకుల్ ప్రీత్ సింగ్

  • 'మన్మథుడు 2' సినిమా ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కు వస్తున్న రకుల్
  • ఆమెతో పాటు వస్తున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్
  • ఆగస్టు 9న విడుదలకానున్న 'మన్మథుడు 2'
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది. తన తాజా చిత్రం 'మన్మథుడు 2' సినిమా ప్రమోషన్ లో భాగంగా హౌస్ లోకి రానుంది. ఆమెతో పాటు చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా హౌస్ లోకి ఎంటర్ కానున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ నటించిన సంగతి తెలిసిందే. నాగ్ ఈ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 9న 'మన్మథుడు 2' చిత్రం విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
Rakul Preet Singh
Nagarjuna
Bigg Boss
Manmadhudu 2
Tollywood

More Telugu News