పుల్వామా ఉగ్రదాడి సహ కుట్రదారుడు హతం
- అనంత్‌నాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
- బక్తూర్ గురేజ్‌లో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
- గురేజ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్
అనంత్‌నాగ్‌లో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒక ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తనను తాను కమాండర్‌గా ప్రకటించుకున్నట్టు భద్రతాధికారులు తెలిపారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనక హతమైన ఉగ్రవాది పంజూ అలియాస్ ఫయాజ్ అహ్మద్ థోకర్ అలియాస్ హజుల్లా బై హస్తం ఉందని, ఈ దాడిలో అతడు సహ కుట్రదారుడని ఆర్మీ తెలిపింది. పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.